Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులకు అస్వస్థత

Author
Posted By ARYADVI NEWS
| 27 Sep 2026, 09:19 AM | ANDHRA PRADESH
సాంబారులో బల్లి.. 19 మంది విద్యార్థినులకు అస్వస్థత

తునిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హాస్టల్‌లో కలకలం రేగింది. సాంబారులో బల్లి పడటంతో భోజనం చేసిన 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులకు కడుపునొప్పి మొదలైంది. సాంబారు గిన్నెను పరిశీలించగా అందులో చనిపోయిన బల్లి కనిపించింది.విద్యార్థినులను వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఫోన్‌లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.