Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ ఐపిఎస్

Author
Posted By ARYADVI NEWS
| 28 Sep 2026, 10:24 PM | TELANGANA
పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ ఐపిఎస్

ప్రజా ఫిర్యాదులపై వేగంగా పోలీస్ సేవలు : జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట జిల్లా,సెప్టెంబర్ 28 :సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
ప్రజా రక్షణ కోసం పోలీసు సిబ్బంది అనుక్షణం విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.