Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అక్టోబర్‌లో ఎండల మోత!

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 08:05 AM | INTERNATIONAL, NATIONAL
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అక్టోబర్‌లో ఎండల మోత!

ఈసారి చలికాలం కాస్త వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్టోబర్‌లోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలంగాణలో రానున్న రోజుల్లో వేడి వాతావరణం కొనసాగవచ్చని తెలుస్తోంది.వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి చలికాలం దశ ప్రారంభమైనప్పటికీ.. ఈసారి చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా సాధారణ స్థాయికి తగ్గే అవకాశాలున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో తగ్గిన వర్షాలు
తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, నిర్మల్, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో లోటు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం?
పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొంది.ఈ వాతావరణ మార్పులు వ్యవసాయం, నీటి లభ్యత, ఆరోగ్యం, విద్యుత్‌ అవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ముందస్తు ప్రణాళికలు అవసరమని వాతావరణ సంస్థ సూచించింది.