Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఆఫీసులకు రావొద్దు!

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 08:09 AM | ANDHRA PRADESH
ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఆఫీసులకు రావొద్దు!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్ తెలిపారు. పత్రాలు సమర్పించేందుకు ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) వెళ్లి అవసరమైన పత్రాలను తీసుకుంటారని తెలిపారు. అనంతరం ఆ పత్రాలను అధికారులే ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థలో నమోదు చేస్తారని వివరించారు.

ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు

నగరాల్లోని నైట్‌ షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల ఓటు నమోదు కోసం అవసరాన్ని బట్టి ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను సీఈవో ఆదేశించారు.విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వస్తే.. నోటీసు పొందిన వ్యక్తి తరఫున 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుడు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 209 కేసుల్లో మాత్రమే ఆన్‌లైన్‌ విచారణ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తర్వాత కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు

ప్రత్యేక సవరణ సమయంలో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోలేకపోయిన యువత, తొలిసారి ఓటు వేయబోయేవారు ఆ తర్వాత కూడా నిరంతర నవీకరణ ప్రక్రియ ద్వారా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్‌ యాదవ్ తెలిపారు.