Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అనంత్ అంబానీని హత్తుకున్న చంద్రబాబు.. ‘ఏపీ ముద్దుబిడ్డ’ అంటూ ఆప్యాయత

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 06:32 PM | Array
అనంత్ అంబానీని హత్తుకున్న చంద్రబాబు.. ‘ఏపీ ముద్దుబిడ్డ’ అంటూ ఆప్యాయత

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. “మీరు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అంతకుముందు మాట్లాడిన అనంత్ అంబానీ.. ఆంధ్రప్రదేశ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. తనను ఏపీ బిడ్డగా చూడాలని, రాష్ట్ర అభివృద్ధికి తాను ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలని చంద్రబాబును కోరారు. ఆయన ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అనంత్ అంబానీని తమ రాష్ట్ర బిడ్డగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు చంద్రబాబు, నిర్మలా సీతారామన్, పవన్ కల్యాణ్, అనంత్ అంబానీ, నారా లోకేశ్ కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ హబ్ ద్వారా రాయలసీమలో ఉద్యాన రంగానికి ఊతం, ఆధునిక సాగు పద్ధతులకు ప్రోత్సాహం, రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.