Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

2027 ప్రపంచకప్‌కు పాండ్యా కీలకం: గంగూలీ

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 06:42 PM | Sports
2027 ప్రపంచకప్‌కు పాండ్యా కీలకం: గంగూలీ

2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సమతూకం కోసం హార్దిక్ పాండ్యా కీలకమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. పాండ్యాను పూర్తి ఫిట్‌నెస్‌తో ప్రపంచకప్‌కు సిద్ధం చేయడమే టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న ప్రధాన సవాల్‌ అని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ప్రపంచకప్ జరగనుంది. గత ప్రపంచకప్‌లో గాయంతో టోర్నీకి దూరమైన పాండ్యా విషయంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్త అవసరమని గంగూలీ అభిప్రాయపడ్డారు.

పాండ్యా అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డి ప్రత్యామ్నాయంగా ఉండొచ్చని ఆయన చెప్పారు. అయితే అప్పటివరకు నితీశ్‌ వరుసగా క్రికెట్ ఆడుతూ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని అన్నారు. రవీంద్ర జడేజా కూడా మరో ఆప్షన్‌గా ఉంటాడని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే సీమింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంటుందని గంగూలీ వివరించారు. టాప్‌-5 బ్యాటర్లలో బౌలింగ్ చేసే వారు లేకపోవడంతో ఐదో లేదా ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను జట్టులో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం భారత జట్టుకు మంచిదేనని గంగూలీ అభిప్రాయపడ్డారు. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ కూడా ఆరంభంలోనే కఠినమైన మ్యాచ్‌లు ఆడటం ద్వారా జట్టు కాంబినేషన్‌, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌ను పరీక్షించుకోవచ్చని పేర్కొన్నారు.