Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పాలనలో సమన్వయ లోపం

Author
Posted By ARYADVI NEWS
| 04 Oct 2026, 09:13 AM | TELANGANA
పాలనలో సమన్వయ లోపం

-ఆర్ధిక విషయంలో మంత్రులకు లేని స్వేచ్ఛ

-ముఖ్యమంత్రి రేవంత్ తీరు బాగున్నా ఎంపికలో పొరపాట్లు

-చట్టం అవినీతి పరులకు చుట్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

-ఉద్యమాలకు యువతరమే పునాది

-ఓటు తొలగింపు నేరమే

-మీట్ ద ప్రెస్లో కూనంనేని

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 3 : ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సమన్వయం లోపించిందని అది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు బాగున్నా అనేక అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని పునాదిగా నిలిచిన ఓటు హక్కును తొలగించడం నేరమేనని ఆయన స్పష్టం చేశారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) ఆధ్వర్యంలో శనివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూనంనేనితో ఖమ్మంలో నిర్వహించారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ యువతరం ప్రజా ఉద్యమాలకు పునాదిగా నిలిచిందని నాటి స్వాతంత్రోద్యమం, సాయుధ తెలంగాణ పోరాటం, తెలంగాణ సాధనోద్యమం, పేదల పక్షాన కమ్యూనిస్టు పార్టీ సాగించిన అనేక పోరాటాల్లో యువతరమే ముందు నిలిచిందన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్కీ ఉద్యమించడంతో దిమాగి నక్సల్స్ పేరుతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపు నేరమని ప్రజాస్వామ్యానికి ఓటే మూలస్తంభమని దానిని తొలగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడవడమేనన్నారు. 60 కోట్ల భోపోర్స్ కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే లక్షల కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్న బిజెపి ప్రభుత్వాన్ని ఏవిధంగా శిక్షించాలని ఆయన ప్రశ్నించారు. జ్ఞానేష్కుమార్ దిగిపోవాల్సిందేనని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉదృతం అవుతుందన్నారు. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయని కొద్ది మంది చేతుల్లో సంపద పొగుపడుతుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్న సొమ్మును సరైన రీతిలో ఈ ప్రభుత్వానికి ఖర్చు చేయడం చేతకావడం లేదన్నారు. ఆర్థిక వ్యవహారాలు కేంద్రీకృతమవుతున్నాయని వివిధ శాఖల్లో ఖర్చు పెట్టే అవకాశం లేకుండా పోయిందని మంత్రులు స్వేచ్ఛగా పాలన చేసే పరిస్థితి లేదన్నారు. దీనితో కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయన్నారు. కొన్ని హామీలు నెరవేర్చిన అది చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని సాంబశివరావు తెలిపారు. బొగ్గు దొంగతనం అన్న ప్రచారంలోనూ కాంగ్రెస్ నిజాలను ప్రజలకు వివరించలేకపోయిందన్నారు. ధరణి వల్లనే బిఆర్ఎస్ ఓడిపోయిందని ఇప్పుడు కాంగ్రెస్ కూడా సరైన రీతిలో వ్యవహరించకపోతే ముప్పు తప్పదన్నారు. ఏ ప్రభుత్వమైనా నిషేధిత జాబితాను కొనసాగిస్తారని కానీ చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అనుభవదారు కాలాన్ని రద్దు చేయడం మళ్లీ భూ యజమానులకు ఊతమిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో సమర్థవంతంగా నడపలేకపోతుందన్న భావన
వ్యక్తమవుతుందన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమకు తెలపకుండానే మా అనుబంధ సంఘాన్ని ఆర్టీసి ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నం చేయడం ఓ మంత్రి కమ్యూనిస్టు సంఘాలను ఉద్దేశించి మాట్లాడటం ఇబ్బందికరమన్నారు. కమ్యూనిస్టు యూనియన్లను గెలవనివ్వవద్దన్న ఆయన తీరు సరి కాదని సాంబశివరావు తెలిపారు. ఎంఎల్సి ఎన్నికల్లో పోటీ చేయాలా ఎవరికి మద్దుతు ఇవ్వాలా అన్న దానిపై ఇంకా నిర్ణయించలేదన్నారు. కొత్తగూడెం నియోజక వర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అన్ని నియోజక వర్గాల మాదిరి కొత్తగూడెంలో కూడా పర్యటిస్తే తప్పులేదు కానీ తరచూ పర్యటనలు చేయడం శత్రుపక్ష శాసన సభ్యుని పట్ల వ్యవహరించడం సరికాదన్నారు. అంతిమంగా ప్రజలే నిర్ణేతలన్నారు. మిత్రపక్ష శాసనసభ్యుడు ఉన్న చోట అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టుల నైతిక మద్దతు కాంగ్రెస్ గెలుపులో కీలక భూమిక పోషించిందన్నారు. ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కమ్యూనిస్టులు విడివిడిగా పోటీ చేయడాన్ని ప్రస్తావిస్తూ కలిసిపోతే తప్ప రెండు పార్టీలు విడివిడిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదన్నారు. ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టినప్పుడు మిత్రపక్షంగా సమర్థిస్తామని ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాలకు సంబంధించి ప్రశ్నించక తప్పదని ఆయన తెలిపారు. ప్రశ్నించే వారి పట్ల గత ప్రభుత్వం మాదిరే వ్యవహరిస్తూ ముందస్తు అరెస్టులు, ఆందోళనలు అణిచివేతలు చేస్తే గత ఫలితమే పునరావృతమవుతుందన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.