Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

విష జ్వరాల విజృంభణతో పడకేసిన పల్లెలు

Author
Posted By ARYADVI NEWS
| 05 Oct 2026, 08:01 PM | TELANGANA
విష జ్వరాల విజృంభణతో పడకేసిన పల్లెలు

ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

పంచాయతీలలో పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలి కొండబోయిన నాగేశ్వరరావు

కారేపల్లి, అక్టోబర్ 5:

డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభించడంతో పల్లెలు పడకేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విష జ్వరాల నివారణకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని పంచాయతీల్లో మురికి కాలువలు బాగు చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ మందు పిచికారి చేసి పారిశుద్ధ్య పై దృష్టి పెట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం షేక్ బందే అలీ అధ్యక్షతన కారేపల్లి లో జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశాలు కొండబోయిన నాగేశ్వరావు మాట్లాడుతూ
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంచాయతీల్లో పారిశుద్ధం పనులు జరగక డెంగ్యూ, మలేరియా తదితర వైరల్ జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. అనేక గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు సభ్యులు జ్వరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేక గ్రామీణ వైద్యులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలు, మండల కేంద్రానికి సుదూరంగా ఉన్న గ్రామాలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం మొబైల్ వైద్య వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)తో పాటు పల్లె దవాఖానాల్లో వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రోగులకు జ్వరానికి తగిన వైద్యం, మందులు ఉచితంగా అందించాలని గ్రామ పంచాయతీల్లో నీటి నిల్వ లేకుండా మురికి కాలవలు బాగు చేసి బ్లీచింగ్ తో పాటు దోమల మందు పిచికారి చేసి పారిశుద్ధ్యం పనులపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు తలారి దేవప్రకాష్, శాఖ కార్యదర్శి అన్నవరపు కృష్ణ, కొండబోయిన ఉమావతి, ముండ్ల ఏకాంబరం, ముక్క సీతారాములు, ఎస్.కె. మహమ్మద్ పాషా, పాసిని నాగేశ్వరరావు, ఇల్లంగి పిచ్చయ్య కరికపల్లి రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి