Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతూ.. మునగాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ డ్రామాలా?

Author
Posted By ARYADVI NEWS
| 06 Oct 2026, 06:00 PM | TELANGANA
గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతూ.. మునగాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ డ్రామాలా?

- మంత్రి ఉత్తమ్ పై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్

కోదాడ, అక్టోబర్ 5 ( ఆర్యాద్వి): మునగాల మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న హంగులు, ఆర్భాటాలు చూస్తుంటే ముచ్చటేస్తోందని, దేశంలోనే అతిపెద్ద సెంట్రలైజ్డ్ కిచెన్ తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని కోదాడ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు.

ఆదివారం కోదాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మునగాలలో కొత్త కిచెన్ ముచ్చట పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఏంటి? పేద పిల్లలకు మూడు పూటలా నాణ్యమైన, సురక్షితమైన అన్నం పెట్టలేని నీచమైన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తొలగించారు. రోజూ ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థులు పురుగుల అన్నం తింటూ ఆసుపత్రుల పాలవుతుంటే, ఇక్కడ సెంట్రలైజ్డ్ కిచెన్ అంటూ రాజకీయ పర్యటనలు, పబ్లిసిటీలు చేసుకోవడానికి సిగ్గులేదా?" అంటూ మంత్రి ఉత్తమ్ ను నిలదీశారు.

ఇవి కూడా చదవండి

ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం కాంగ్రెస్ కొత్తగా కనిపెట్టింది కాదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే అన్నపూర్ణ పథకం ద్వారా లక్షలాది మంది పేదల కడుపు నింపిందని, అప్పుడు కూడా ఇదే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోదాడలో పేదలకు అన్నం పెట్టామని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా అన్నపూర్ణ పథకాన్ని అభినందించారని గుర్తు చేశారు.

రైతాంగ పరిస్థితిపై మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు కరెంట్, నీళ్లు లేక రోడ్లెక్కి లాఠీదెబ్బలు తింటుంటే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షేర్ ఆటోలా హెలికాప్టర్ ను వాడుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నెలకు పదిసార్లు హెలికాప్టర్లలో తిరగడం తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, పునాదికి ఒకసారి, బేస్ మెంట్ కు ఒకసారి అంటూ ప్రతి చిన్న పనికి హెలికాప్టర్ వేసుకుని వచ్చి హంగులు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సచివాలయంలోనే రూ.50 లక్షల నీటి బిల్లు కట్టలేక చేతులెత్తేసిన దివాళా ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కేవలం పబ్లిసిటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, తిరగబడి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.