Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అనంతగిరిలో రూ.14.98 కోట్లతో భారీ గోదాముల నిర్మాణం

Author
Posted By ARYADVI NEWS
| 06 Oct 2026, 07:27 PM | TELANGANA
అనంతగిరిలో రూ.14.98 కోట్లతో భారీ గోదాముల నిర్మాణం

శాంతినగర్ లో భూమిపూజ చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

అనంతగిరి, అక్టోబర్ 5 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ లో రూ.14.98 కోట్ల వ్యయంతో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న భారీ గోదాముల నిర్మాణానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఆదివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

అనంతగిరిలో రూ.14.98 కోట్లతో భారీ గోదాముల నిర్మాణం - Additional Image

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

"రూ.14.98 కోట్లతో 15 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అనంతగిరి మండలంలో వ్యవసాయ మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయి" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గోదాముల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.