Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు

Author
Posted By ARYADVI NEWS
| 07 Oct 2026, 07:31 PM | TELANGANA
సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

- ప్రతి పౌరుని రక్షణ, భద్రత పోలీసు బాధ్యత.

సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు - Additional Image

- విద్యార్థులు సైబర్ వారియర్లుగా మారి సమాజాన్ని చైతన్యపరచాలి.

- అవగాహన లోపం, అత్యాశతోనే సైబర్ మోసాలు..

ఇవి కూడా చదవండి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 7 (ఆర్యాద్వి):సూర్యాపేట జిల్లాలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ జాగ్రత్త దినోత్సవం లో భాగంగా సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సైబర్ మోసాల నివారణ, సైబర్ సెక్యూరిటీపై గురువారం రోజున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... ప్రతి పౌరుడి భద్రత, రక్షణే పోలీసుల ముఖ్య విధి అని తెలిపినారు, పౌరుల రక్షణలో అనుక్షణం పని చేస్తున్నాము అన్నారు. సమాజంలో జరిగే ఆర్థిక నేరాలు నేరాలు, దొంగతనాల్లో ప్రస్తుతం సైబర్ మోసాలే అత్యధికంగా 80 శాతం నమోదవుతున్నాయని అన్నారు. ప్రజల అత్యాశ, అవగాహన లోపాన్ని ఆయుధంగా చేసుకున్న సైబర్ మోసగాళ్ళు సుదూర ప్రాంతాల్లో ఉండి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు. నిరుపేదలు, పండ్లు, కూరగాయలు అమ్మేవారు, టిఫిన్ బండ్లు, చిన్నపాటి దుకాణాలు నడుపుకునే వారి పేర్లతో నకిలీ, అద్దె బ్యాంక్ ఖాతాలను తెరిచి, పెద్ద మొత్తంలో లావాదేవీల కోసం కరెంట్ ఖాతాలను కూడా కొనుగోలు చేస్తున్నారు అన్నారు. ఒక ఆరాటంలో ఉండి బ్యాంక్ కథలు ఆపరేట్ చేస్తూ, మరో ప్రాంతంలో డబ్బులు విత్ డ్రా చేస్తుండటం వల్ల వారిని గుర్తించడం కష్టమవుతోంది. గతంలో భౌతిక దొంగతనాలకు సంబంధించి ఆధారాలు లభించేవని, కానీ ప్రస్తుత సైబర్ మోసాల్లో ఆధారాలు దొరకని అన్నారు. ఏ బ్యాంకు అధికారులు గానీ, దర్యాప్తు/పోలీసు సంస్థలు గానీ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు అడగరని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పే మాటలను అస్సలు నమ్మవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుని వారియర్లుగా మారాలని, తమ తల్లిదండ్రులను, సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.


రాగింగ్ విష సంస్కృతి – కఠిన చర్యలు తప్పువు:.
కళాశాలల్లో రాగింగ్ అనేది విష సంస్కృతి అని, తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తీవ్రమైన నేరమని ఎస్పీ హెచ్చరించారు. రాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కళాశాల నుండి టర్మినేట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు లక్ష్యంతో, ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలని, తల్లిదండ్రుల కలలను, గురువుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ వైద్యాధికారి వెంకట్రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాలతి, మెడికల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామా రావు, స్థానిక ఎస్సైలు యాదవేందర్ రెడ్డి, అజయ్ కుమార్, షీ టీమ్ ఎస్సై నీలిమ, పోలీసు కళాబృందం మరియు కళాశాల వైద్య ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాల్గొన్నారు