Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మున్సిపోల్స్‌పై జగన్ స్పీడ్.. తొలి అభ్యర్థి ప్రకటన

Author
Posted By ARYADVI NEWS
| 07 Oct 2026, 08:55 PM | ANDHRA PRADESH
మున్సిపోల్స్‌పై జగన్ స్పీడ్.. తొలి అభ్యర్థి ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోకస్ పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే పార్టీ తరఫున తొలి మేయర్ అభ్యర్థిని ప్రకటించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.

నెల్లూరు నుంచి తొలి ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించారు. సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో బలమైన, విశ్వసనీయమైన అభ్యర్థులను గుర్తించి ముందుగానే కసరత్తు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

తాజాగా నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా వైసీపీ ఎన్నికల కసరత్తులో తొలి అడుగు వేసింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

ఎన్నికలపై వరుస సమావేశాలు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, క్షేత్రస్థాయి బలాబలాలపై జగన్ వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో వన్‌టు-వన్ భేటీలు నిర్వహిస్తూ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లపై ఇంకా అధికారిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.