Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జ్ఞానేష్కుమార్ రాజీనామా చేయాల్సిందే

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 09:28 AM | TELANGANA
జ్ఞానేష్కుమార్ రాజీనామా చేయాల్సిందే

-ఖమ్మంలో నినదించిన ఇండియా కూటమి

-పెద్ద సంఖ్యలో పాల్గొన్న వామపక్ష, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, విద్యార్థి, యువజనులు

-సిసిఏ సంపూర్ణ మద్దతు

ఇవి కూడా చదవండి

ఖమ్మం ప్రతినిధి, అక్టోబర్: 8:

ఖమ్మం : ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్కుమార్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు నినదించాయి. తప్పుడు మార్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్న పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గురువారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి మయూరిసెంటర్ పాత బస్టాండ్ మీదుగా జెడ్పి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) మాస్న్, సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ జ్ఞానేష్కుమార్ ఎన్నికల అధికారిలా కాకుండా బిజెపి కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన నిర్వహించిన ఎన్నికల అన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హేమంతరావు డిమాండ్ చేశారు. మోడీ ప్రజా మద్దతుతో గెలవలేక ఎన్నికల సంఘాన్ని తన గెలుపుకోసం వాడుకున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషనర్గా మోడీ, అమిత్లు తమ ఏజెంటును నియమించుకున్నారన్నారు. కోట్లాది మంది ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని హేమంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బిజెపి ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈవిఎంలో చోటు చేసుకున్న మాయ బిజెపికి గెలుపుకు కారణమయ్యాయన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో ఉండటానికి అనర్హుడని తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాయని ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిలా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, ప్రత్యామ్నాయ పౌర సమాజం బాధ్యులు గోపగాని శంకర్రావు తదితరులు ప్రసంగించగా సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్, జానిమియా, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుంబూరు దయాకర్రెడ్డి, తుమ్మల యుగంధర్, కట్ల రంగారావు, సిపిఎం నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రం, యర్రా శ్రీనివాస్, మాస్లైన్ నాయకులు ఆవుల అశోక్, జన సమితి నాయకులు గోపగాని శంకర్రావు, కాంగ్రెస్ నాయకురాలు
దొబ్బల సౌజన్య, బచ్చలకూరి నాగరాజు, బాలాజీ నాయక్, సిసిఏ బాధ్యులు కాకి భాస్కర్, విజయ్, యువజన విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.