Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఎక్కడిది?

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 09:30 AM | TELANGANA
రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఎక్కడిది?


మాటల్లో 24 గంటలు.. క్షేత్రస్థాయిలో విద్యుత్ కోతలా?

అధికారంలోకి రావడానికి 24 గంటల కరెంటు హామీలు... గద్దెనెక్కిన తర్వాత రైతుకు మొండి చెయ్యి

ప్రభుత్వ ప్రకటనలు ఒకలా.. రైతుల పరిస్థితి మరోలా!

ఇవి కూడా చదవండి

వ్యవసాయ విద్యుత్‌పై నిర్లక్ష్యం వీడాలి.. రైతులకు న్యాయం చేయాలి

_ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, అక్టోబర్ 08 ):
వ్యవసాయ విద్యుత్ సరఫరాపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లను, విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నిరసన తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాలకు రోజుకు ఎన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు? విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారు? సరఫరాలో అంతరాయాలకు కారణాలేమిటి? అనే అంశాలపై విద్యుత్ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత అవసరమని ఆయన పేర్కొన్నారు.రైతులకు సాగునీరు అందించడంలో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని, సరైన సమయంలో కరెంటు అందకపోతే పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం.. రైతుల సంక్షేమం గురించి ఎలా మాట్లాడుతుంది? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదని, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులు ఉండాలని అన్నారు. అధికారిక రికార్డుల్లో నమోదైన విద్యుత్ సరఫరా గంటలకు, రైతులు వాస్తవంగా పొందుతున్న విద్యుత్‌కు మధ్య వ్యత్యాసం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరా సమయాలు, కోతల వివరాలు, లో వోల్టేజీ సమస్యలు, తరచూ విద్యుత్ నిలిచిపోవడం వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు సక్రమంగా విద్యుత్ అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే, ఆ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం విఫలమైందనీ పేర్కొన్నారు. రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. రైతులకు పంటలు పొట్ట దశ కీలక సమయం కావున అవసరమైన సాగునీరు, విద్యుత్‌ను సక్రమంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని, విద్యుత్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.