Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అనంతగిరి మండలం పాలవరం తండాలో తప్పిన పెను ప్రమాదం!

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 10:58 AM | Array
అనంతగిరి మండలం పాలవరం తండాలో తప్పిన పెను ప్రమాదం!

*తెగిపడిన 11 KV హైటెన్షన్ వైర్లు - 50 ఏళ్ల నాటి వైర్లతో ప్రజల ప్రాణాలకు ముప్పు*

*అనంతగిరి, అక్టోబర్ 09 (ఆర్యాద్వి):* సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండా గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని జనావాసాల మీదుగా వెళ్తున్న 11 KV హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

గత 50 సంవత్సరాల క్రితం వేసిన పాత వైర్లు కావడంతో తుప్పుపట్టి ఎప్పుడో పుటుక్కున తెగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*ఏళ్లుగా విన్నవించినా పట్టించుకోని అధికారులు*
ఊరి మధ్య నుండి, ఇళ్లపై నుండి వెళ్తున్న 11 KV లైన్ ను ఊరి బయట నుండి తీసుకెళ్లాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పాలవరం తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ నెల శుక్రవారం ఉదయం వైర్లు తెగిపడే సమయంలో కింద పిల్లలు, మహిళలు ఉంటే పరిస్థితి ఏంటి?
50 ఏళ్ల నాటి తుప్పుపట్టిన వైర్లతో మా ప్రాణాలకు ముప్పు వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి ఈ 11 KV లైన్ ను ఊరి బయట నుండి తీసుకువెళ్లాలి" అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి, పాత వైర్లను తొలగించి కొత్త వైర్లు వేయడంతో పాటు, లైన్ ను ఊరి బయట నుండి మళ్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.