Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎర్రబోడులో బతుకమ్మ సంబరాలు..

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 07:09 PM | TELANGANA
 ఎర్రబోడులో బతుకమ్మ సంబరాలు..

కారేపల్లి: అక్టోబర్, 9:
కారేపల్లి మండలం ఎర్రబోడులో ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఎర్రబోడు ప్రాథమిక పాఠశాలలో
శుక్రవారం ఉత్సాహంగా మరియు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు . పాఠశాల ఆవరణమంతా పూలతో అలకరించబడగా , పేరెంట్స్ , ఉపాధ్యాయునిలు , విద్యార్థినులు రంగురంగుల దుస్తుల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలు కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తయారుచేసి వాటి చుట్టూ తిరుగుతూ, బతుకమ్మ పాటలు పాడారు . పాఠశాల ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది . ఈ వేడుకలో తల్లిదండ్రులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఇది విద్యార్థులకు తమ సంస్కృతి , సంప్రదాయాలను పెద్దల నుంచి నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది . ఈ బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు , ఇది ప్రకృతిని , జీవితాన్ని పూజించే పండుగ . మన సంస్కృతిని , వారసత్వాన్ని భావితరాలకు అందించడం చాలా అవసరం . విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఇలా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సంబరాల కార్యక్రమంలో ఎర్రబోడు ఉపసర్పంచ్ కడియాల రమ. సుధాకర్, అంగన్వాడి టీచర్లు కురసం కృష్ణవేణి భూక్య ఉమాదేవి ఆయాలు కుంజ సుగుణ రాధ పాల్గొన్నారు

 ఎర్రబోడులో బతుకమ్మ సంబరాలు.. - Additional Image