Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.. పాల్గొన్న సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 07:22 PM | TELANGANA
బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.. పాల్గొన్న సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు

బక్క హేమ్లాతండా గ్రామపంచాయతి లో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో సర్పంచ్ కృష్ణ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, విద్యార్థినులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవాలని సర్పంచ్ కృష్ణ నాయక్ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, అంగన్వాడీ టీచర్ స్, ANM, ఆయలు గ్రామ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.. పాల్గొన్న సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ గారు  - Additional Image