Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ప‌ద‌వుల‌కోసం కాదు ప‌నిచేసే వారికే ఓటు వేయండి

Author
Posted By ARYADVI NEWS
| 09 Oct 2026, 07:30 PM | TELANGANA
ప‌ద‌వుల‌కోసం కాదు ప‌నిచేసే వారికే ఓటు వేయండి

మరోసారి ఎమ్మెల్సీ బరిలో అశోక్ సార్

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేసిన పాలకూరి అశోక్


ఈసారి ఎన్నికల్లో విజయం నాదేనని ధీమా

విలేక‌రుల స‌మావేశంలో వ‌రంగ‌ల్‌-ఖమ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్వ‌తంత్ర అభ్య‌ర్థి పాల‌కూరి అశోక్ సార్

ఇవి కూడా చదవండి

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9:

ప‌ద‌వుల‌కోసం కాదు ప‌నిచేసే వారికే ఓటు వేయాలని,
ఈసారి ఎన్నికల్లో విజయం నాదేనని వ‌రంగ‌ల్‌-ఖమ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్వ‌తంత్ర అభ్య‌ర్థి పాల‌కూరి అశోక్ సార్ అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
కొంత‌మంది రాత్రికి రాత్రే ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా పుట్టుక వ‌స్తున్నార‌ని, అటువంటి తగిన గుణపాఠం చెప్పాలని, నిత్యం జ‌నం కోసం ప‌నిచేసే వారికే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.
గ‌త 12 సంవ‌త్స‌రాలుగా నిరుద్యోగుల‌కు నిధులు లేవు, నియామ‌కాలు లేవు. ఇంటికో ఉద్యోగం లేదు, ఏడాదిలోగా రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు లేవు. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు, 420 హామీలు త‌ప్ప నిరుద్యోగుల‌కు మిగిలింది శూన్యం అని అన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో నాన్ లోక‌ల్ క‌బ్జా అత్తెస‌రు ప్ర‌భుత్వ ఉద్యోగాలు తెలంగాణ‌లో నిరుద్యోగ భార‌తం. ప్ర‌మాద‌పుటంచున ప్ర‌భుత్వ విద్య నెల‌కొని ఉంద‌ని అన్నారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 వేల మొదటి ప్రాధాన్యత ఓటు 90 వేల‌ రెండో ప్రాధాన్యత ఓటు సాధించి బిఆర్ఎస్ ఓడిపోవడానికి తానే కారణమయ్యానని, ప్రధాన పార్టీలకు ముచ్చమటలు పట్టించాన‌ని అన్నారు. 90శాతం పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాదని కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి తెలంగాణ పిసిసి రెడ్డి కాంగ్రెస్ గా మారిందని అన్నారు. బిఆర్ఎస్ సైతం ఓసీలకే టికెట్లు కేటాయించడానికి ప్రయత్నం చేస్తుందని అదే జరిగితే ఆ రెండు పార్టీలను, బీసీలు 100 శాతం బొంద‌ పెట్టడం ఖాయమని అన్నారు. ఓట్లు మావి సీట్లు మీవా అని ప్రశ్నించారు. రెండు పార్టీలు హైబ్రిడ్ మొక్కలను తెర మీదకి తెస్తున్నాయని, జన సంబంధం లేని వారు, తెలంగాణ అస్తిత్వం తెలియని వారు, డబ్బుల సంచులతో పోటీ చేయాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీలో కోర్టుల్లో నాటకలాడి బీసీలను నిండా ముంచిందని, ఇప్పుడు బీసీలకు సీట్లు కేటాయించడానికి అవకాశం ఉన్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 10 శాతం కూడా లేని ఓసీలు 70 శాతం అసెంబ్లీని కబ్జా పెట్టారని అన్నారు.
గ‌త 15 ఏండ్లుగా నిరుద్యోగుల కోసం, తెలంగాణ స‌మాజం కోసం ప‌నిచేసాన‌ని అటు బిఆర్ ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు 18 కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేసిన నిరుద్యోగుల ప‌క్ష‌మే త‌ప్ప ఏ ప్ర‌భుత్వానికి అంట కాగ‌లేద‌ని, ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి మూడు సార్లు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేసాన‌ని, ల‌క్ష‌ల మందికి త‌న ఆన్‌లైన్ పాఠాల ద్వారా త‌క్కువ ఫీజుతో, ఉచితంగా పాఠాలు భోదించాన‌ని అన్నారు. నిరుద్యోగుల ప‌క్షాన న‌డి రోడ్డుపై నిల‌బ‌డి పోలీసుల దీగ్భంధాలు చేధించుకుంటూ, నిత్యం కోర్టు మెట్లు ఎక్కుతు నిల‌బ‌డి గొంతు ఎత్తాన‌ని నిరుద్యోగులు, బిసిలు, ఎస్‌సి, ఎస్టీ, మైనార్టీలు అండ‌గా నిల‌బ‌డ‌తార‌ని అన్నారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 13 వేల ఉద్యోగాలు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతుందని, నిరుద్యోగులను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీని పాతంలోకి తొక్కుతారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పన తన ఎన్నికల నినాదంని ప్రకటించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల ప్రకటన ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పవర్ సెక్టార్ లో 5300 ఉద్యోగాలతో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. 25 వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సిని ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించినా ఇప్పటివరకు దిక్కు లేదన్నారు.

సర్కారు బడిని బాగు చేస్తామని రేవంత్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదన్నారు. 33 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలని డిమాండ్ చేశారు.
పేరుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ అస్తిత్వంను ఆంధ్రుల గుప్పెట్లో పెట్టారని భౌగోళిక తెలంగాణ తప్ప సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, తెలంగాణ ఉన్నత కులాల చేతిలో బందీ అయ్యిందని, ఎస్సీ ఎస్టీ, బిసి వర్గాల్లో చైతన్యం ఓటు రూపంలో వచ్చినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. బీసీలందరూ ఐక్యమైనప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ ఊడిగం ఇంకా ఎన్నాళ్లు అని ప్రశ్నించారు. మేమెంతో మాకంత నినాదంతో చేతులు బిగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.వి గౌడ్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బానోతు భద్రు నాయక్ , నాగరాజు, జి. వెంకటనారాయణ, ప్రణీత్, కృష్ణ,బి రమేష్,డి ఉదయ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు