- అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 9:

యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ మరియు పోలీస్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన షీ టీం ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్ల అంటే కుటుంబానికి వెలుగు సమాజానికి బలం దేశ భవిష్యత్తుకు పునాది అని ఒక బాలికకు విద్యను అందిస్తే ఒక కుటుంబానికి వెలిగినట్లేనని అది దేశ అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు కానీ నేటికీ అనేక ప్రాంతాల్లో బాలికలు బాల్యవివాహాలు బాల కార్మికత్వం లింగ వివక్ష పోషకాహార లోపం మరియు విద్యకు దూరం అవడం వంటి అనేకరమైన రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇవన్నీ అరికట్టడం మనందరి బాధ్యత అని అన్నారు. బాలికలపై లైంగిక దాడులు నానాటికి పెరుగుతున్నాయని అలాంటి మృగాల పట్ల ప్రమాదంగా ఉండి రాజుల ఎదగాలని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కోరారు. షీ టీం యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలకు మహిళలకు అవగాహన కల్పిస్తూ అండగా ఉంటున్నామని తెలిపారు సమస్య ఏదైనా ఉంటే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్ 112 కి డయల్ చేసి సహాయం పొందాలని కోరారు.
టైడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా బాల్యవివాహాల నిర్మూలనకు గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాల్యవివాహాలను నిర్మూలించడం బాలికల హక్కుల రక్షణకు పెట్టుబడి పెట్టడం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. బాలికల హక్కుల పై పెట్టుబడి పెట్టడం అంటే వారి విద్య ఆరోగ్యం పోషకాహారం భద్రత నైపుణ్యాల మరియు సమాన అవకాశాలపై దృష్టి పెట్టడం అని వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా బాలికల ఆత్మీయ విశ్వాసంతో తమ భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారని అన్నారు.
అనంతరం బాలికలు ఉపాధ్యాయులు అతిథులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
అందరూ కలిసి బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ ఎస్ టి యు బాధ్యులు భాస్కర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ లత షీ టీం కానిస్టేబుల్స్ రుక్మిణి కిరణ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు , సభ్యులు రాందాస్ రవీంద్ర బాబు భాస్కర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు


