Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

Author
Posted By ARYADVI NEWS
| 10 Oct 2026, 06:38 PM | TELANGANA
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు

_ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష  - Additional Image

సూర్యాపేట,అక్టోబర్ 10 (ఆర్యాద్వి):
సూర్యాపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 2k రన్ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా పదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ గొప్పతనాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకానికి గుర్తుచేయడానికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో ఉపాధి లేక పట్టణాలకు కూలీ కోసం వలస వెళ్లేవారని, గట్కో గంజో తాగి పస్తులున్న రోజులు ఉండేవని ఆయన గుర్తుచేశారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ వివక్ష కారణంగా వాటిని వాడుకోలేని పరిస్థితి నుంచి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత పట్టించుకున్నవారు లేరని అన్నారు. ఒకప్పుడు చిన్న పనుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లి బస్టాండ్లలో పడుకునే పరిస్థితి ఉండేదని, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. దేశంలో పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. వ్యవసాయానికి పనికిరావు అనుకున్న మారుమూల భూములకు సైతం కృష్ణమ్మ, గోదావరి జలాలను అందించి తెలంగాణను ధాన్యపు రాశులుగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్ అని కీర్తించారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ పెరిగి భూముల ధరలు నేడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. కేసీఆర్ ని కాదని మార్పు కోరుకుంటే నేడు కాంగ్రెస్ (రేవంత్ రెడ్డి) పాలనలో కట్టిన ఇల్లు పీకినట్లుగా రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా తయారుచేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, కరెంటు లేక, యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటకు సరైన మద్దతు ధర ఇచ్చి కొనే నాథుడు లేడని అన్నారు. జరిగిన అభివృద్ధిని కొనసాగించాలన్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మళ్లీ కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి