- విరిగిన తొడ ఎముక కి రాడ్ , ప్లేట్ వేసి శస్త్ర చికిత్స
- మూగ జీవి కోసం దూర భారాన్ని లెక్కచేయని యజమాని
కోదాడ, అక్టోబర్ 10 (ఆర్యాద్వి):
హైదరాబాద్ నగరానికి చెందిన జంతు యజమాని ఉపాధికోసం ఆవులను పెంచుకుంటున్నాడు.ఇంటివద్ద ఆవులతో పాటు బెల్జియం షెఫర్డ్ జాతికి చెందిన ఒక కుక్కను సాకుతున్నారు. నిన్న మధ్యాహ్నం కుక్క అనుకోకుండా ఆవుల దగ్గరకు వెళ్లేసరికి ఆవు తన్నడంతో కుక్క వెనుక కాలు తొడ ఎముక ముక్కలుగా విరిగింది. తెలిసిన డా క్టర్ ని సంప్రదించగా సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకెళ్లమని సలహా ఇవ్వడంతో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి కోదాడకు కుక్కను తీసుకొని వచ్చారు.
కుక్కకి విరిగిన కాలును పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ అత్యంత సంక్లిష్ట ఫ్రాక్చర్ గా గుర్తించి జనరల్ అనస్థీషియా ఉపయోగించి విరిగి ముక్కలైన తీస ఎముకను అతి కష్టం పై జత చేసి ఎముకను జత చేయడానికి రాడ్ వేసి అవిబ్కడలకుండా. స్టీల్ ప్లేట్ తో బిగించి ఎముకలను అతికించి విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు.
సాధారణంగా మనుష్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే మెరుగైన వైద్యం కోసం జిల్లాల నుండి హైదరాబాద్ వెళ్ళడం సహజం కాగా దానికి విరుద్ధంగా నమ్మకంతో హైదరాబాద్ నుండి కుక్కను తీసుకుని వచ్చి కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సకు రావడం తో జంతు యజమానులు ఆశ్చర్యంగా ఆపరేషన్ తిలకిస్తూ, ఒక మూగ జీవికోసం వ్యయ ప్రయాసలకోర్చి ఇంత దూరం వచ్చిన జంతు ప్రేమికుడి కుక్క ఆపరేషన్ తో తమ కేసులకు ఆలస్యం అయినా సరే సుదూరం నుండి వచ్చిన కుక్క యజమానికి సహకరించి అతిథి లాగా చూసుకొని శస్త్ర చికిత్స అనంతరం వారిని పంపించారు .
శస్త్ర చికిత్సలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కాంపాటి చంద్రకళ, రోహిత్ పాల్గొన్నారు