Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

సర్పంచ్ చొరవతో గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు

Author
Posted By ARYADVI NEWS
| 12 Oct 2026, 06:59 PM | TELANGANA
సర్పంచ్ చొరవతో  గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు

అక్టోబర్ 12, అనంతగిరి (ఆర్యాద్వి):మండల పరిధిలోని పాలవరం గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజల సౌకర్యం మరియు భద్రత కోసం సర్పంచ్ మట్టపల్లి నరేష్ చొరవతో వీధి దీపాలను సోమవారం ఏర్పాటు చేశారు. అంధకారంలో ఉన్న ప్రధాన రహదారులు, కాలనీలు, పాఠశాల పరిసర ప్రాంతాల్లో కొత్తగా దీపాలు అమర్చడంతో గ్రామస్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నారు.
గ్రామ పంచాయతీ పరిధిలోని ముఖ్య వీధుల్లో ఎల్ ఈ డి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దీపాలు అమర్చారు. పాతగా మారిన దీపాలను మార్చడం, దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించడం కూడా జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,... “గ్రామంలో రాత్రి వేళల్లో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు సురక్షితంగా తిరగాలని ఈ ఏర్పాటు చేశాం అని, మిగిలిన వీధుల్లోనూ దశలవారీగా దీపాలు అమర్చనున్నాం” అని అన్నారు.దీంతో
గ్రామస్థులు, “రాత్రి వేళల్లో కూడా వీధుల్లో వెలుతురు ఉంది కాబట్టి. దొంగల భయం తగ్గింది అని సర్పంచ్‌కు ధన్యవాదాలు” తెల్పారు.

సర్పంచ్ చొరవతో  గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు - Additional Image