Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..,

Author
Posted By ARYADVI NEWS
| 14 Oct 2026, 09:10 AM | TELANGANA
ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  బతుకమ్మ సంబరాలు..,

ఖమ్మం నగరం: అక్టోబర్, 13 :

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఖమ్మం నగరపాల సంస్థ ప్రాంగణంలో
మంగళవారం ఉత్సాహంగా మరియు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు . ఖమ్మం నగరపాలక సంస్థ ఆవరణమంతా పూలతో అలంకరించి , కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తయారుచేసి వాటి చుట్టూ తిరుగుతూ, బతుకమ్మ పాటలు పాడారు .ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది ఈ బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఈ సంస్కృతి , సంప్రదాయాలను పెద్దల నుంచి నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది . ఈ బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు , ఇది ప్రకృతిని , జీవితాన్ని పూజించే పండుగ . మన సంస్కృతిని , వారసత్వాన్ని భావితరాలకు అందించడం చాలా అవసరం .,వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సంబరాల కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు సుధాకర్,బుర్రి వెంకటేశ్వర్లు,వాటర్ సప్లై లైన్మెన్లు రమణ, సాంబశివరావు, ప్రభాకర్,సూర్యం, సత్యనారాయణ, వాల్ ఆపరేటర్స్ తదితరులు పాల్గొని వివిధ విభాగాల మహిళలు బతకమ్మ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.