Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలు: పోలీస్ కమిషనర్

Author
Posted By ARYADVI NEWS
| 14 Oct 2026, 06:59 PM | TELANGANA
అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలు: పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 14:


పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

ఓపెన్ హౌస్ కార్యక్రమాలు

పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసుల ప్రతిభ, త్యాగాలను ప్రజలకు వివరించనున్నారు.

వ్యాసరచన పోటీలు విద్యార్థులకు(12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం )

1.సైబర్ నేరాల నివారణలో పోలీసు పౌరుల యొక్క పాత్ర

2.డ్రగ్స్ నిర్వహణ: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స నుండి ఎలా దురంగా ఉండగలరు

డిగ్రీ మరియు అంతకంటే పై స్థాయి విద్యార్థుల కోసం

1.సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర

2.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర

పోలీస్ సిబ్బందికి రెండు కేటగిరీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

కేటగిరీ–1: కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు

1.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలను ఆశిస్తారు?

2.పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర మీడియాకు బానిస కాకుండా ఉండటం మరియు వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం దానిని సద్వినియోగం చేసుకోవడం ఎలా

ఇవి కూడా చదవండి

కేటగిరీ–2: ఎస్‌ఐ మరియు పై స్థాయి అధికారులకు

1.పౌరులమన్ననలు పొందటానికి పోలీసులు చేయవలసిన కృషి

2.క్షేత్రస్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం

ఈ పోటీలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. వ్యాసం 500 పదాలకు మించకూడదు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు:

పోలీస్ అమరవీరుల స్మరణార్థం రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. సైకిల్ ర్యాలీల్లో యువత, విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయనున్నారు.

అమరవీరుల కుటుంబాల పరామర్శ:

పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అమరవీరుల విగ్రహాలు లేదా ఫొటోలు ఉన్న ప్రాంతాల్లో ఇన్‌స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే పై స్థాయి అధికారులు గ్రామ పెద్దలు,యువత, విద్యార్థుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు:

పోలీస్ అమరవీరుల త్యాగాలు,పోలీసుల విధులు,ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనాలని కమిషనర్ కోరారు.

పాల్గొనేవారు 3 ఫోటోలు మరియు 3 నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్ రూపొందించి సమర్పించాలి. ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో ఉండాలి. షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో పూర్తి వివరాలతో అందజేయాలి. కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్,ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీల కోసం డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించనున్నారు.

ఫోటోలు,షార్ట్ ఫిల్మ్‌లను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ పి ఆర్ వో (8712659256) కార్యాలయంలో అందజేయాలి.

అక్టోబర్ 21న స్మృతి పరేడ్

అక్టోబర్ 21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా “స్మృతి పరేడ్”, “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలను పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్ లోని స్మారక స్థూపం వద్ద ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.