Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

Author
Posted By ARYADVI NEWS
| 14 Oct 2026, 07:13 PM | TELANGANA
ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు

నూతనకల్, ఆర్యాద్వి న్యూస్‌: ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని బక్క హేమ్లాతండా గ్రామ సర్పంచ్‌ గుగులోత్‌ కృష్ణ నాయక్‌, ఉప సర్పంచ్‌ నేనావత్‌ సురేందర్‌ నాయక్‌, గ్రామ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు కేతావత్‌ మంగత్య నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు గుగులోత్‌ సురేందర్‌ నాయక్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం

ఇవి కూడా చదవండి

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం బక్క హేమ్లాతండా గ్రామంలో బుధవారం సర్పంచ్‌ గుగులోత్‌ కృష్ణ నాయక్‌తో కలిసి పాత్తులోతు రవి నాయక్‌ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నూతన ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యవతి, కాంగ్రెస్‌ నాయకులు మూడ్‌ చంపు నాయక్‌, పాత్తులోతు రవి నాయక్‌, పాత్తులోతు సైదా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.