Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు?

Author
Posted By ARYADVI NEWS
| 15 Oct 2026, 09:25 AM | TELANGANA
జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు?

- సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం

సింగరేణి : అక్టోబర్, 14:


దేశ ప్రజలు ముక్తకంఠంతో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విద్యార్థులు యువజనలు ప్రజలు రోడ్లమీద కొచ్చి దేశ రాజధాని ఢిల్లీ లో పోరాడుతుంటే ప్రజలపై దేశం కని విని ఎరుగని రీతిలో నిర్బంధం ప్రయోగించడం వెనుక జ్ఞానేశ్ కుమార్ పై మోదీకి అంత ప్రేమ ఎందుకు అని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ప్రశ్నించారు.
స్థానిక భాగం రామ నరసయ్య భవనంలో సిపిఎం సింగరేణి మండల కమిటీ శాఖ కార్యదర్శిల సమావేశం మండల కమిటీ సభ్యులకు వల్లబోయిన కొండలరావు అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో మోడీ ఎన్నికల కమిషనర్ కు మద్దతు ఇవ్వడం వెనుక మోడీ ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని అందులో భాగంగానే చర్యలు తీసుకోవడం లేదని జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పులైన SIR లో అవకతవకలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికలో చట్టాల మార్పు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు జీవితకాలం చేసిన తప్పులకు ఎలాంటి శిక్ష లేకుండా చట్టం తేవడం ఆ కుట్రలో భాగమేనని స్వామి భక్తికి దక్షిణ ఇచ్చినట్లుగా రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన ఎన్నికల కమిషన్ ను బిజెపి జేబు సంస్థగా మార్చి 13 కోట్ల ఓట్లు తీసివేయడం, ఓటు నమోదు ఫామ్స్ లో నిబంధనలు మార్చడం, సుప్రీంకోర్టు తీర్పులను కాలరాయడం, తోటి కమిషనర్ల సలహాలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఇదంతా సుప్రీంకోర్టు జడ్జి బుయాన్ చెప్పినట్లుగా భారత రాజ్యాంగాని కి విరుద్ధమని ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని జ్ఞానేశ్ కుమార్ ఈ చర్యలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడుతుంటే భయపడిన మోడీ ప్రభుత్వం ఢిల్లీని ఎమర్జెన్సీ అంతకుమించి కర్ఫ్యూ అంతకుమించి లాక్ డౌన్ లోకి దేశ రాజధాని నగరాన్ని మార్చి విద్యార్థులు యువకులు ప్రజాప్రతినిధులు మహిళలు జర్నలిస్టులు అనేది లేకుండా విపరీతంగా నిర్బంధించడం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఆఖరికి ఈ ఉద్యమంపై ఆర్ఎస్ఎస్ గుండాలను మరియు ఇంటర్నెట్ నిలుపుదల, బిజెపి నాయకుల అవాకులు చవాకులు సోషల్ మీడియాలో వక్రీకరణలు అవమాన పరిచే వంటి నిరంకుశ విధానాలతో విశ్వ గురువు అని చెప్పుకుంటున్న మోదీ పరిపాలనలో ప్రపంచం ముందు భారత దేశ పరువు పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ప్రజా ఉద్యమాలే అధిక ధరలు, నిరుద్యోగం, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా సంపద కాపాడడం వంటి సమస్యలకు మార్గమని ఆ దారిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని భూక్య వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు,మండల కార్యదర్శి కే నరేంద్ర, వజ్జా రామారావు, కురసం శ్రీను, బానోత్ కిషన్, గంగాధర్ ని ఉపేందర్, పాల్తీయ రాంజి, వాంకుడోత్ బాబురావు, చల్ల మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.