Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

‘టాక్సిక్‌’పై రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం.. “అలాంటి సన్నివేశాలు చూడలేక బయటకు వచ్చేశా”

Author
Posted By ARYADVI NEWS
| 31 Aug 2026, 06:41 PM | తాజా సమాచారం
‘టాక్సిక్‌’పై రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం.. “అలాంటి సన్నివేశాలు చూడలేక బయటకు వచ్చేశా”

హింస, అశ్లీలతకు బదులు సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని సూచన

హైదరాబాద్‌: యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌’ సినిమాపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

సినిమాల్లో హింస, అశ్లీలతను ప్రధానంగా చూపించకుండా సమాజానికి ఉపయోగపడే కథలను తెరకెక్కించాలని రాజాసింగ్‌ సినీ దర్శకులు, నిర్మాతలకు సూచించారు. ధర్మం, భక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేలా చిత్రాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

మధ్యలోనే థియేటర్‌ నుంచి బయటకు..

ఇవి కూడా చదవండి

‘టాక్సిక్‌’ సినిమా చూసేందుకు తాను థియేటర్‌కు వెళ్లానని రాజాసింగ్‌ తెలిపారు. అయితే సినిమాలోని కొన్ని అశ్లీల, హింసాత్మక సన్నివేశాలు తనకు నచ్చలేదని చెప్పారు. వాటిని చూడలేక సినిమా పూర్తికాకముందే థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు.

యశ్‌ వంటి అగ్ర కథానాయకులు కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూసే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దర్శకులు కూడా తమ సినిమాల ద్వారా సమాజంపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

‘ఇరుముడి’, ‘ఛావా’కు ప్రశంసలు

సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలకు ఉదాహరణగా ‘ఇరుముడి’, ‘ఛావా’ చిత్రాలను రాజాసింగ్‌ ప్రస్తావించారు. ‘ఇరుముడి’లో ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత కనిపిస్తాయని, ‘ఛావా’లో ధైర్యం, దేశభక్తి వంటి అంశాలను చూపించారని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న విడుదలైన ‘టాక్సిక్‌’కు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.