Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ

Author
Posted By ARYADVI NEWS
| 07 Sep 2026, 06:07 PM | TELANGANA
చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోదాడ గాంధీ చౌక్ వద్ద మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మెరుపు రాస్తారోకో!

సూర్యాపేట సెప్టెంబర్ 07: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నఅప్రజాస్వామిక, నిరంకుశ పోకడలపై,ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ‘కౌరవ సభ’గా మార్చిందని ధ్వజమెత్తుతూ, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను సభకు రాకుండా పోలీసు బలగాలతో అక్రమంగా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి, సీనియర్ నేత తన్నీరు హరీష్ పై పోలీసులు ప్రదర్శించిన దురుసు ప్రవర్తన, దాష్టీకాన్ని ఖండించారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా, మహిళల పట్ల పాటించాల్సిన నైతిక విలువలను పక్కనబెట్టి పోలీసులతో భౌతిక దాడులు చేయించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనిబొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తుపాకీలు, లాఠీలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అదేవిదంగా బీఆర్ఎస్ అగ్రనేతలు, మహిళా ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు తెగబడిన పోలీసులపై తక్షణమే శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ దారుణ ఘటనకుప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు.

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ  - Additional Image