Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

బిగ్ బాస్ 10 బిగ్ ట్విస్ట్:

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 06:49 PM | advt.
బిగ్ బాస్ 10 బిగ్ ట్విస్ట్:

హౌస్‌లోకి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10లో నాలుగో వారం ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారంతో పాటు, అక్టోబర్ రెండో వారంలో భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి.

వైల్డ్ కార్డ్ రేసులో సీరత్ కపూర్, నీతు, మౌనీషా చౌదరి, రామకృష్ణ, సోనియా సింగ్, సౌందర్య రెడ్డి, నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి వస్తారనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వారం నామినేషన్‌లో ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఉన్నారు. మరోవైపు వర్షిణి కూడా ఎలిమినేషన్‌ చర్చల్లో నిలిచింది. గత వారం ముకేశ్ తన కెప్టెన్సీ, ఇమ్యూనిటీని వదులుకుని ఆమెను సేవ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం వర్షిణి, చరణ్, సృష్టి డేంజర్ జోన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు హౌస్‌ను వీడతారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నిజమైతే ఇప్పటికే ఏర్పడిన గ్రూపులు, స్నేహాలు, గేమ్ ప్లాన్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలిమినేషన్‌, వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై తుది నిర్ణయం బిగ్ బాస్ టీమ్‌దే.