మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతగిరి అక్టోబర్ 02 (ఆర్యాద్వి):అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో అనంతగిరి మండలం మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు ,తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్ముని సేవలను స్మరించుకున్నారు.
మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస, శాంతి, సహనం, నైతిక విలువలను ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు.గాంధీజీ ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, సమాజంలో సత్యనిష్ఠ, మానవత్వం, సమానత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంటూ రమాదేవి నాగేశ్వరరావు, మాజీ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు గుండ్లపల్లి వెంకన్న, మాజీ సర్పంచ్ గూడ పూరి పున్నయ్య, మేళ్లచెరువు వెంకటయ్య, ఆకారపు ముత్తయ్య, బొడ్డుపల్లి ప్రవీణ్, దేవులపల్లి నాగరాజ్, గద్దె రామారావు, బుర్ర సతీష్, చంటి, సైదులు, వీరస్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.