Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ... ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

Author
Posted By ARYADVI NEWS
| 08 Oct 2026, 09:41 AM | TELANGANA
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ...   ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

• అందుకు మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి
• వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలు కోసం జేఏసీ ఏర్పాటు
• డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ ప్రత్యేక దృష్టి
• కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ఏఐపై పట్టు సాధించాలి
• వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 7:
ఖమ్మం: జర్నలిస్టుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిపి హైదారాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు రాష్ట్ర పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయక పోతే, జర్నలిస్టుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం ఖమ్మంలోని టీటీడీసీ బిల్డింగ్ లో డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాణా ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రాబోవు రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాడేందుకు ఆన్ని జర్నలిస్టు సంఘాలతో కలిపి జేఏసీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా వివిధ జర్నలిస్టు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐక్య పోరాటాలు సాగిస్తామన్నారు. జర్నలిస్టులకు చట్ట బద్ధంగా దక్కాల్సిన వేతనాలు, సంక్షేమ పథకాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, హక్కుల సాధన కోసం డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో కూడా నిరంతర పోరాటాలు సాగిస్తామన్నారు. ఈ రంగంలో పని చేస్తున్న వేలాది మంది జర్నలిస్టులు కనీస వేతనాలు, భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా యాజమాన్యాలు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా జర్నలిస్టులతో వెట్టి చాకిరీ చేయించుకోవడం దారుణమని, జర్నలిస్టులకు న్యాయంగా దక్కాల్సిన వేతనాలు, ఇతర సదుపాయాల కోసం యాజమాన్యాలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకించి డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై కూడా తమ సంఘం దృష్టి సారిస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు అమలుకావాల్సిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించేందుకు సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా పని చేస్తూ, దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తోందని తెలిపారు. ప్రస్తుతం జర్నలిజంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోక పోతే జర్నలిస్టులు వెనుకబడే ప్రమాదం ఉందని రాణా ప్రతాప్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రతి జర్నలిస్టు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఐ సాయంతో వార్తలను రూపొందించే విధానాలు, వార్తా రచనలో సాంకేతికతను వినియోగించుకునే పద్ధతులను ఆయన వివరించారు.

సంఘాన్ని మరింత విస్తరించాలి: రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎస్ రావు

డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్ రావు) మాట్లాడుతూ రానున్న ఒకటటీ, రెండు నెలల్లో యూనియన్ ను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వుందన్నారు. అందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని, సభ్యత్వాల నమోదును పెంచాలని కోరారు. అలాగే, ఎప్పటికప్పుడు స్థానిక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగించాలని పిలుపు నిచ్చారు. పోరాటాల ద్వారానే సంఘం బలోపేతమవుతుందని, ఆ దిశగా ప్రతి జిల్లాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం డబ్ల్యూజేఐ సభ్యులకు డిజిటల్ గుర్తింపు కార్డులను అందజేసి, సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ హెచ్. రామకృష్ణా రెడ్డి, టీజేఏ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మణి కుమార్, డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కోకన్వీనర్లు ఎం.ఏ అన్సార్ పాషా, ఎన్. రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ కోలే దామోదర్, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, వివిధ జిల్లాల నాయకులు జాబిశెట్టి కుటుంబ రావు, గోగుల నారాయణ రావు, కట్టెకోల చిన నరసయ్య, మోడెపల్లి కిరణ్, ఏనిగండ్ల శ్రీనివాస్, నల్లా జగన్ రెడ్డి, జానీ, వేర్పుల సాగర్, పొనకంటి ఉపేందర్, బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్, వుల్లోజి హరీష్, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.