-సిపిఎం నాయకులు కొండేబోయిన నాగేశ్వరరావు -కే నరేంద్ర.
కారేపల్లి: అక్టోబర్ 9
ఇవి కూడా చదవండి
యూత్ ఐకాన్, ప్రపంచ విప్లవకారుడు ఇయర్ నెక్స్ట్ చేగువేరా 59వ వర్ధంతిని సిపిఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎదుర్కోవడంలో ఓడించడంలో క్యూబాలో విప్లవం సాధించడంలోనూ ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన దానికి కారణం అమెరికన్ సామ్రాజ్యవాదం అని అంతర్జాతీయ వేదికలపై ఎండ కట్టడంలో కీలక భూమిక పోషించిన నిజమైన ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని కొనియాడారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని మిత్రదేశాలు ప్రపంచం పై పెత్తనం చేయడం కోసం వనరులను దోచుకోవడం కోసం చేస్తున్న యుద్ధాలలో భాగమే ఇరాన్, పచ్చిమాసి యా యుద్దాలని అందులో భాగమే ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో నిరంకుశంగా వ్యవహరిస్తూ హెచ్ వన్ బి విశ్వదారులను ఇబ్బందులకు గురి చేయడం అప్రజాస్వామిక చర్యలను గమనించవచ్చని ఈ ప్రమాదాన్ని చేగువేరా చాలా సంవత్సరాల ముందే గుర్తించారని అందుకే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికై తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆ భయంతోనే అమెరికా బొలివియాలో చేగువేరాను హత్య చేసిందని విమర్శించారు. చేగువేరా మరణించిన ఆయన ఆశయ సాధనకై ప్రపంచంలో మార్గదర్శకంగా స్ఫూర్తితో పోరాడుతున్నారని నేడు ప్రపంచం ఇదే సామ్రాజ్యవాద సమస్యను ఎదుర్కొంటున్నదని దానికి వ్యతిరేకంగా పోరాడటమే చేగువేరా గిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో చిత్రపటానికి మండల కార్యదర్శి కే నరేంద్ర పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కేశగాని ఉపేందర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు చల్ల మల్లమ్మ నాయకులు జి శ్రీను ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు


